logo

ఒక్కరోజే 1,212 కేసులు

జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1,212 కేసులు నమోదయ్యాయి. గతేడాది మే తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. క్రియాశీలక కేసులు 6,195కి ఎగబాకాయి. కరోనా

Published : 23 Jan 2022 01:41 IST

గుంటూరు వైద్యం: జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1,212 కేసులు నమోదయ్యాయి. గతేడాది మే తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. క్రియాశీలక కేసులు 6,195కి ఎగబాకాయి. కరోనా మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య 1,261ని తాకింది. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,86,996కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. గుంటూరు, నరసరావుపేట, మంగళగిరి, తాడేపల్లిలో మొత్తం కేసుల్లో 70.46శాతం నమోదు కావడం గమనార్హం. ఈ నాలుగుప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని