logo

ఓటీఎస్‌ లక్ష్యాలపై సమన్వయంతో పనిచేయండి

ఓటీఎస్‌ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మండల పరిషత్తు కార్యాలయంలో ఓటీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటీఎస్‌ కార్యక్రమంలో

Published : 23 Jan 2022 01:41 IST


మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్‌

యడ్లపాడు, న్యూస్‌టుడే: ఓటీఎస్‌ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మండల పరిషత్తు కార్యాలయంలో ఓటీఎస్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటీఎస్‌ కార్యక్రమంలో నగదు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్లు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. సాంకేతిక, ఇతర ఇబ్బందులు ఉంటే ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాగే జగనన్న కాలనీల్లో నివేశన స్థలాలు పొందిన వారందరూ ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలు చేసుకునే వారికి ఇసుకు, ఇనుము తదితర సామగ్రి అందించటంలో ఇబ్బందులను గుర్తించి పరిష్కారం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హౌసింగ్‌ ఈఈ స్వరూపారాణి, ఆర్డీవో శేషిరెడ్డి, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఏఈ ఎన్‌ఎంఎస్‌ నాయుడు పాల్గొన్నారు.

రైల్వే మార్గం భూముల తనిఖీ..

నాదెండ్ల, న్యూస్‌టుడే: గుంటూరు-గుంతకల్లు రెండో రైల్వే మార్గం నిర్మాణానికి సేకరించిన వ్యవసాయ భూములను జిల్లా సంయుక్త పాలనాధికారి(రెవెన్యూ) దినేష్‌ కుమార్‌ శనివారం తనిఖీ చేశారు. సాతులూరు, చందవరం, గొరిజవోలులోని భూముల దస్త్రాలు పరిశీలించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడారు. ఆయా సచివాలయాల పరిధిలో ఓటీఎస్‌ని సమీక్షించారు. ఆర్డీవో శేషిరెడ్డి, తహశీల్దారు సురేష్‌, ఏవో హరిప్రసాదు, సర్వేయర్‌ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని