logo

‘తెదేపాకు కార్యకర్తలే బలం’

తెదేపాకు కార్యకర్తలే బలమని.. వారే నాయకులను నడిపించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

Published : 23 Jan 2022 01:41 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, పక్కన తెదేపా నాయకులు శ్రీనివాసరావు, వందనాదేవి, రామకృష్ణ తదితరులు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: తెదేపాకు కార్యకర్తలే బలమని.. వారే నాయకులను నడిపించాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏ సమస్య, తేడా ఉన్నా నిర్మోహమాటంగా కార్యకర్తలు చెప్పాలని కోరారు. ఏకతాటిపై ఉండి పార్టీని పటిష్ఠంగా నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు చూపుతున్న ప్రేమ, ఆదరణకు ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనని వ్యాఖ్యానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలతో కలిసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కేకు కోశారు. అన్నదానం చేశారు. తొలుత సత్తెనపల్లి మండలం పెదమక్కెన, గుడిపూడి, నందిగామ గ్రామాల్లో వైవీ ఆంజనేయులతో కలిసి అభిమానులు ప్రదర్శనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సతీమణి అనంతకుమారి, కుమారుడు సుజిత్‌కుమార్‌, తెదేపా నాయకులు యెల్లినేడి రామస్వామి, సాగి కోటేశ్వరరావు, చౌటా శ్రీనివాసరావు, ఆళ్ల సాంబయ్య, బీమినేని వందనాదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని