logo

కొవిడ్‌ బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

జిల్లాలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు తీసుకొచ్చిన రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టరు రాజకుమారి ఆదేశించారు. శనివారం ఆమె నగర శివారు అడవితక్కెళ్లపాడులోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. తాగునీటి సౌకర్యంతోపాటు పడకలు,

Published : 23 Jan 2022 01:41 IST

అధికారులకు సూచనలు చేస్తున్న జేసీ రాజకుమారి

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు తీసుకొచ్చిన రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను జిల్లా సంయుక్త కలెక్టరు రాజకుమారి ఆదేశించారు. శనివారం ఆమె నగర శివారు అడవితక్కెళ్లపాడులోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేశారు. తాగునీటి సౌకర్యంతోపాటు పడకలు, వ్యర్థాలను వేసేందుకు బిన్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. రోగులకు రక్త పరీక్షలు, ఎక్స్‌రే పరీక్షలు చేసే గదులను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు యుగంధర్‌కుమార్‌, కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ లక్ష్మానాయక్‌, ఇన్‌ఛార్జి టాండన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని