logo

త్వరితగతిన ఇల్లు నిర్మించుకోవాలి

ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి చెప్పారు. హౌసింగ్‌ బేస్‌మెంట్‌ మేళాలో భాగంగా ఆయన సోమవారం యడ్లపాడు మండంలోని తిమ్మాపురంలో ఇళ్ల స్థలాల

Published : 25 Jan 2022 01:40 IST


తిమ్మాపురం లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణాలు పరిశీలిస్తున్న జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి

యడ్లపాడు, న్యూస్‌టుడే: ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి చెప్పారు. హౌసింగ్‌ బేస్‌మెంట్‌ మేళాలో భాగంగా ఆయన సోమవారం యడ్లపాడు మండంలోని తిమ్మాపురంలో ఇళ్ల స్థలాల లేఅవుట్‌ను సందర్శించారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఇసుక కొరత సమస్యను హౌసింగ్‌ అధికారులు జడ్పీ సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఇసుక కొరతను లేకుండా చూస్తానని పెండింగ్‌లో ఉన్న 66 మంది లబ్ధిదారులతో ఇల్లు నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఎంపీడీవో కార్యాలయంలో ఓటీఎస్‌పై సచివాలయ కార్యదర్శుతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మాధురి, హౌసింగ్‌ ఏఈ ఎన్‌ఎంఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని