logo

రసవత్తరంగా పశు బల ప్రదర్శన పోటీలు

దుర్గిలో ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సోమవారం రెండోరోజు రెండు పండ్ల విభాగంలో పోటీలు ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగిన పోటీల్లో మొతం 33 ఎడ్లజతలు పాల్గొనగా కృష్ణా జిల్లాకు చెందిన వత్సవాయికి

Published : 25 Jan 2022 01:40 IST


బండ లాగుతున్న ఎడ్లు

దుర్గి, న్యూస్‌టుడే: దుర్గిలో ఒంగోలు జాతి పశు బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సోమవారం రెండోరోజు రెండు పండ్ల విభాగంలో పోటీలు ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగిన పోటీల్లో మొతం 33 ఎడ్లజతలు పాల్గొనగా కృష్ణా జిల్లాకు చెందిన వత్సవాయికి చెందిన కె.ప్రభాకరరెడ్డి ఎడ్లజత నిర్ణీత సమయానికి 4015.5 అడుగులు లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, తోటపాలేనికి చెందిన రామినేని రత్తయ్యచౌదరి, రేహంత్‌చౌదరీల ఎడ్లు సంయుక్తంగా నిర్ణీత సమయానికి 3882.3 అడుగులు లాగి రెండోస్థానంలో నిలిచాయి. మరో ఏడు బహుమతులను ఆయా స్థానాల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు పోటీల నిర్వాహకులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని