logo

ఆలయ ఎక్స్‌అఫీషియో సభ్యునికి మెమో జారీ

ఆయన ఆలయ ట్రస్టు బోర్డులో ఎక్స్‌అఫీషియో సభ్యుడు. పాలన వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన పదవిలో ఉన్నారు. అర్చకులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే విధుల్లో నిర్లక్ష్యం వహించి మెమో అందుకున్నారు. ఓ పాలక

Published : 25 Jan 2022 01:40 IST

పెదకాకాని, న్యూస్‌టుడే: ఆయన ఆలయ ట్రస్టు బోర్డులో ఎక్స్‌అఫీషియో సభ్యుడు. పాలన వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన పదవిలో ఉన్నారు. అర్చకులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే విధుల్లో నిర్లక్ష్యం వహించి మెమో అందుకున్నారు. ఓ పాలక మండలి ఎక్స్‌అఫీషియో సభ్యుడు తాఖీదులు అందుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు పొత్తూరి ప్రసాద్‌ శనివారం రాత్రి విధులు ముగించుకొని ఆలయానికి తాళం వేశారు. ఆ తాళాన్ని మరుసటి ఉదయం విధులు నిర్వహించాల్సిన పాలక మండలి ఎక్స్‌అఫీషియో సభ్యుడైన చదలవాడ జాలయ్య ఇంటికి ఓ అర్చకుడి ద్వారా పంపించారు.ఎక్స్‌అఫీషియో సభ్యుడు లేరు. కుటుంబ సభ్యులు చరవాణి ద్వారా జాలయ్యకి సమాచారం అందించారు. తాళాలు వెనక్కి పంపించాలని ఆయన చెప్పడంతో కుటుంబ సభ్యులు తీసుకోలేదు. దీంతో ప్రధాన అర్చకుడి చేతికి తాళాలు వెళ్లడంతో చేసేది లేక ఆయన ఆలయ కౌంటర్లో తాళాలు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ సహాయ కమిషనర్‌ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తాళాలు తిరస్కరించినందుకు జాలయ్యకు, కౌంటర్లో ఇచ్చినందుకు ప్రధాన అర్చకుడికి మెమోలు జారీ చేశారని సమాచారం. దీనిపై ‘న్యూస్‌టుడే’ దేవస్థాన సహాయ కమిషనర్‌ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా.. ‘ఆలయ తాళాలు అర్చకుల దగ్గర ఉండాలి. కానీ వాటిని కౌంటర్లో ఇచ్చినందుకు ప్రధాన అర్చకుడికి, తీసుకోకుండా తిరస్కరించినందుకు ఎక్స్‌అఫిషియో సభ్యుడికి మెమోలు జారీ చేశా’మని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని