logo

ఒకే నమూనాలో సెలవు పత్రం

రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు జిల్లాలో ఎక్కువ మంది ఉద్యోగులు మంగళవారం సామూహిక సెలవులు పెట్టనున్నారు. ఈనెల 25 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండటంతో ఉద్యోగులు వారు పని చేస్తున్న కార్యాలయాల అధికారులకు క్యాజువల్‌

Published : 25 Jan 2022 01:40 IST


ఉద్యోగుల సెలవు నమూనా పత్రం

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: రాష్ట్ర పీఆర్‌సీ సాధన సమితి పిలుపు మేరకు జిల్లాలో ఎక్కువ మంది ఉద్యోగులు మంగళవారం సామూహిక సెలవులు పెట్టనున్నారు. ఈనెల 25 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతుండటంతో ఉద్యోగులు వారు పని చేస్తున్న కార్యాలయాల అధికారులకు క్యాజువల్‌ లీవ్‌ (సీఎల్‌) ఒకే నమూనాలో దరఖాస్తు చేయనున్నారు. మంగళవారం ఉదయం పది గంటలకు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు జరిగే ర్యాలీ, అనంతరం సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ధర్నాలో పాల్గొనేందుకు సెలవు పెడుతున్నట్లు నమూనా పత్రంలో పేర్కొన్నారు. ఆయా శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులకు నమూనా పత్రాలను పంపి ఆ విధంగా సెలవు పత్రాలను అందజేసి ధర్నాకు హాజరుకావాలని సూచించారు. దీంతో సోమవారం సాయంత్రమే ఉద్యోగులు అధికారులను కలిసి సెలవు పత్రాలను పూర్తి చేసి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని