logo

మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు

ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటున్నట్లు బాపట్ల తహశీల్దారు కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ముత్తాయపాలెం ఆర్‌బీకే, పట్టణంలోని ఇమ్మడిశెట్టివారిపాలెం సచివాలయాన్ని ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తహశీల్దారు మాట్లాడుతూ..

Published : 25 Jan 2022 01:40 IST


గ్రామ సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న బాపట్ల తహశీల్దారు గోపాలకృష్ణ

బాపట్ల, న్యూస్‌టుడే : ఆర్‌బీకేల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకే ధాన్యం కొంటున్నట్లు బాపట్ల తహశీల్దారు కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ముత్తాయపాలెం ఆర్‌బీకే, పట్టణంలోని ఇమ్మడిశెట్టివారిపాలెం సచివాలయాన్ని ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తహశీల్దారు మాట్లాడుతూ.. రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని దళారులు, వ్యాపారులకు విక్రయించి నష్టపోవద్దన్నారు. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లోగా రైతు బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని