logo

వాకావారిపల్లి వాసికి పోలీసు పతకం

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీసు మెడల్‌ (ఐపీఎం)కు నెల్లూరు సీఐడీ డీఎస్పీ వాకా శ్రీరాంబాబు ఎంపికయ్యారు. శ్రీరాంబాబు స్వస్థలం చెరుకుపల్లి మండలం వాకావారిపల్లి. పోలీసుశాఖలో ఉత్తమ సేవలందించిన అధికారులకు కేంద్రం పతకాలను ప్రకటించిన జాబితాలో నెల్లూరు సీఐడీ

Published : 26 Jan 2022 02:05 IST


శ్రీరాంబాబు, సీఐడీ డీఎస్పీ

నెల్లూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ పోలీసు మెడల్‌ (ఐపీఎం)కు నెల్లూరు సీఐడీ డీఎస్పీ వాకా శ్రీరాంబాబు ఎంపికయ్యారు. శ్రీరాంబాబు స్వస్థలం చెరుకుపల్లి మండలం వాకావారిపల్లి. పోలీసుశాఖలో ఉత్తమ సేవలందించిన అధికారులకు కేంద్రం పతకాలను ప్రకటించిన జాబితాలో నెల్లూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన చోటుదక్కించుకున్నారు. మన జిల్లాకు చెందిన శ్రీరాంబాబు 1989లో పోలీసు శాఖలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టి నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. 2004లో సీఐగా, 2013లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సేవా పతకం, 2011లో ఉత్తమ సేవా పతకం, 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్కృష్ట సేవా పతకం.. ఇలా సుమారు 200 పతకాలు అందుకున్నారు. తాజాగా ఇండియన్‌ పోలీసు మెడల్‌ వరించింది. ఎస్పీ సీహెచ్‌ విజయ రావు, సీఐడీ ఏఎస్పీ రాజేంద్ర కుమార్‌ రాంబాబుకు అభినందనలు తెలిపారు.

జిల్లాలో ఇద్దరికి పోలీసు పతకాలు

గుంటూరు: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చెందిన డీఎస్పీ చుండూరు శ్రీనివాసరావు, ఏఎస్సై తూమాటి నరేంద్రకుమార్‌లను పోలీసు పతకాలకు ఎంపిక చేసింది. 1999 ఎస్సై బ్యాచ్‌కు చెందిన చుండూరు శ్రీనివాసరావు తొలుత రెంటచింతల, గురజాల, గుంటూరు నగరంపాలెంలో పనిచేశారు. 2014లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది గుంటూరు రూరల్‌ నేర విభాగం, ఇంటిలిజెన్స్‌, సీఐడీలో పనిచేశారు. ప్రస్తుతం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేస్తున్నారు.

1984 కానిస్టేబుల్‌ బ్యాచ్‌కు చెందిన తూమాటి నరేంద్రకుమార్‌ దుగ్గిరాల, అమృతలూరు, నగరంపాలెం, నరసరావుపేట పట్టణం, రూరల్‌, బాపట్లలో పనిచేశారు. 2011లో హెడ్‌ కానిస్టేబుల్‌గా, 2016లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎస్సై)గా ఉద్యోగోన్నతి పొందారు. ప్రస్తుతం గుంటూరు అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్నారు. అవార్డులు, నగదు రివార్డులు 50కి పైగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని