logo

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

గణతంత్ర వేడుకలు బుధవారం ఉదయం పోలీసు కవాతు మైదానంలో జరగనున్నాయి. అధికార యంత్రాంగం రెండు రోజులుగా చేస్తున్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల పనులు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. వీటిని గుంటూరు తూర్పు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ పర్యవేక్షించారు

Published : 26 Jan 2022 02:05 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలు బుధవారం ఉదయం పోలీసు కవాతు మైదానంలో జరగనున్నాయి. అధికార యంత్రాంగం రెండు రోజులుగా చేస్తున్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల పనులు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. వీటిని గుంటూరు తూర్పు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ పర్యవేక్షించారు. బుధవారం ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన నివేదికను వివరిస్తారు. ఈ సందర్భంగానే ప్రభుత్వ శాఖల వారీగా శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక పోటీలు నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేశారు. చివరిగా విధి నిర్వహణలో ఉత్తమంగా సేవలందించిన పలువురు ఉద్యోగులకు అవార్డులను జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని