logo

భారతీయ సంస్కృతి విశిష్టమైంది

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విశిష్టమైనవని ఉప సభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ అమృతోత్సవాలు బాపట్లలోని భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా

Published : 26 Jan 2022 02:05 IST

నృత్య ప్రదర్శనలో విద్యార్థినులు

బాపట్ల, న్యూస్‌టుడే : భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విశిష్టమైనవని ఉప సభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ అమృతోత్సవాలు బాపట్లలోని భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోన మాట్లాడుతూ.. బాపట్ల ప్రాంతాన్ని జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. సూర్యలంకకు త్వరలో కొత్త ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు. కేంద్రం అనుమతుల కోసం పంపించామన్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా భావనారాయణ స్వామి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, మహిళల కోలాట ప్రదర్శన ఆకట్టుకొన్నాయి. కార్యక్రమంలో కేంద్ర పురావస్తు అధికారులు భానుప్రకాష్‌వర్మ, యశ్వంత్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, కైలాష్‌, ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మహిళల కోలాటం...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని