logo

భవనం శిథిలం.. ఆరుబయటే వైద్యం

మూగజీవాలకు వైద్యం అందించే నిజాంపట్నం వైద్యశాల భవనం కూలటానికి సిద్ధంగా ఉంది. గతంలోనే భవనం పెచ్చులూడి పడటం, వర్షం పడటంతో మందులను ఓ మూలకి చేర్చి సేవలు అందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దానిపై పిడుగు పడటంతో మరింత

Published : 27 Jan 2022 02:27 IST


కూలటానికి సిద్ధంగా ఉన్న పశు వైద్యశాల భవనం 

నిజాంపట్నం, న్యూస్‌టుడే : మూగజీవాలకు వైద్యం అందించే నిజాంపట్నం వైద్యశాల భవనం కూలటానికి సిద్ధంగా ఉంది. గతంలోనే భవనం పెచ్చులూడి పడటం, వర్షం పడటంతో మందులను ఓ మూలకి చేర్చి సేవలు అందిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దానిపై పిడుగు పడటంతో మరింత శిథిలమైంది. చేసేది లేక సిబ్బంది ఈ భవనంలోనే సేవలు అందిస్తున్నారు. నిజాంపట్నం, బావాజీపాలెం, ఆముదాలపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలతో పాటు నగరం మండలం గట్టువారిపాలెం ప్రాంతాల రైతులు తమ పశువులను ఇక్కడికి తీసుకొచ్చి చికిత్సలు చేయిస్తుంటారు. అయితే ఇక్కడ భవనం పాతపడటంతో నూతనంగా భవనం నిర్మించాలని, అందుకు కొత్తగా స్థలాన్ని చూపాలని వైద్యాధికారులుగా పని చేసినవారు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళుతూనే ఉన్నారు. అయినా ప్రయోజనం శూన్యం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మూగజీవాలకు వైద్యం అందించే వైద్యశాల నిర్మాణానికి స్థలం ప్రతిపాదించి పక్కాభవనం సమకూర్చాలని ఈప్రాంత రైతులు కోరుతున్నారు. ఈ విషయమై పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు నరేంద్రబాబు వద్ద ప్రస్థావించగా నిజాంపట్నంలో సమస్య ఉన్న మాట వాస్తవమేనన్నారు. కేంద్రం నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపామని, అనుమతి వస్తే పనులు చేపడతామని పేర్కొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని