logo

ప్రతిభ చాటితే.. ఉపకార వేతనం మీదే!

ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వ మానవవనరుల అభివృద్ధి శాఖ తోడ్పాటు అందిస్తుంది. ఇందులో భాగంగా జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్షలో ప్రతిభ చాటిన వారికి నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం(ఎన్‌ఎంఎంఎస్‌)తో

Published : 27 Jan 2022 02:27 IST

ఎన్‌ఎంఎంస్‌ దరఖాస్తుకు తుది గడువు నేడే 


విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్న ఉపాధ్యాయుడు

గుంటూరు, న్యూస్‌టుడే ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా కేంద్ర ప్రభుత్వ మానవవనరుల అభివృద్ధి శాఖ తోడ్పాటు అందిస్తుంది. ఇందులో భాగంగా జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్షలో ప్రతిభ చాటిన వారికి నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం(ఎన్‌ఎంఎంఎస్‌)తో ఏడాదికి రూ.12 వేల చొప్పున మొత్తం 48 వేలు ప్రోత్సాహం అందుతుంది. అంటే 9, 10, ఇంటర్మీడియట్‌ రెండేళ్ల పాటు ఈ ఉపకార వేతనం లభిస్తుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ డిసెంబర్‌ 27 నుంచి మొదలైంది. దరఖాస్తు పూర్తి చేయడానికి ఈనెల 27వ తేదీ తుది గడువు. వివరాల కోసం ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తుకు సంబంధించిన అంశాలు

*2021-22 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ఎయిడెడ్, కార్పొరేషన్, మునిసిపల్, రెసిడెన్షియల్‌ వసతి లేని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు. బీసీ, ఓసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 పరీక్ష రుసుముగా చెల్లించాలి.* విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు ఉండాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలి.* అంతర్జాలంలో www.bse.ap.gov.in  వెబ్‌సైట్‌కి వెళ్లాలి. పాఠశాల డైస్‌కోడ్‌ లాగిన్‌ అయి వెబ్‌సైట్‌లో ఉన్న దరఖాస్తులో విద్యార్థి పూర్తి వివరాలు ఫొటో, సంతకం, కుల, ఆదాయ ధ్రువపత్రాలు ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో నమోదు చేయాలి. అందులోనే ఎస్‌బీఐ కలెక్ట్‌ ద్వారా పరీక్ష రుసుము చెల్లిస్తేనే దరఖాస్తు పూర్తి చేసినట్లే.
పరీక్ష విధానం: తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ మధ్యమంలో జరిగే ఈ పరీక్ష  మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో 180 మార్కులకు  ఉంటుంది.   ఇందులో 90 మార్కులకు రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్, మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లీష్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. మిగిలినది స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష.  7, 8 తరగతుల్లో గణితం, విజ్ఞానశాస్త్రం, సాంఘికశాస్త్రం సబ్జెక్టులపై ప్రశ్నలు వస్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని