logo

‘ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా’

కొత్తగా ఏర్పడుతున్న బాపట్ల జిల్లాను అభివృద్ధిలో మేటిగా తీర్చిదిద్ది రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతానని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంగా వైకాపా ఆధ్వర్యంలో పట్టణంలో

Published : 27 Jan 2022 02:27 IST


కేకు కోసిన అనంతరం భర్తకు కేకు తినిపిస్తున్న ఉప సభాపతి సతీమణి రమాదేవి

బాపట్ల, న్యూస్‌టుడే : కొత్తగా ఏర్పడుతున్న బాపట్ల జిల్లాను అభివృద్ధిలో మేటిగా తీర్చిదిద్ది రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతానని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంగా వైకాపా ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం రాత్రి వేడుకలు నిర్వహించారు. ఉప సభాపతి దంపతులను క్యాంప్‌ కార్యాలయం నుంచి భారీగా ప్రదర్శనగా నాయకులు, కార్యకర్తలు తోడ్కొని వచ్చారు. భావనారాయణస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రథంబజారులో నిర్వహించిన బహిరంగసభలో కోన మాట్లాడుతూ బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి తన పూర్తి దృష్టి కొత్త జిల్లా అభివృద్ధి పైనే ఉంటుందన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. భవన యజమానులు, స్థానికులు చేసిన విజ్ఞప్తి మేరకు పాత బస్టాండ్‌ నుంచి గడియార స్తంభం వరకు రహదారిని 80 అడుగులు కాకుండా 68.50 అడుగుల వెడల్పున విస్తరిస్తామని ప్రకటించారు. జిల్లా సాధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. అనంతరం కోన రఘుపతి, రమాదేవి దంపతులను వైకాపా పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాష్‌ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించారు. బాపట్ల జిల్లా పేరుతో కేకు కోశారు. పిట్టలవానిపాలెం ఎంపీపీ బాజీ, కర్లపాలెం జడ్పీటీసీ వేణుగోపాల్‌రెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు ఎజ్రయ్య, రంగారావు, రాజా, అనిల్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని