logo

ఆగిన ఉచిత బియ్యం

కొవిడ్‌ నేపథ్యంలో ఆహార భద్రత సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేవై) పథకం కింద అల్పాదాయ కుటుంబాలకు ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోయింది. కొవిడ్‌ రెండో దశ నుంచి బియ్యం ఇస్తున్నారు. సెప్టెంబరు వరకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు ఉచిత బియ్యం చేరలేదు. ఈ నెలలోనూ అదే పరిస్థితి. మేకు సంబంధించి రుపాయికే కిలో బియ్యం పంపిణీ 17వ తేదీతో

Published : 20 May 2022 04:19 IST

తాడికొండ గ్రామీణం, సత్తెనపల్లి, న్యూస్‌టుడే

కొవిడ్‌ నేపథ్యంలో ఆహార భద్రత సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేవై) పథకం కింద అల్పాదాయ కుటుంబాలకు ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ నిలిచిపోయింది. కొవిడ్‌ రెండో దశ నుంచి బియ్యం ఇస్తున్నారు. సెప్టెంబరు వరకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు ఉచిత బియ్యం చేరలేదు. ఈ నెలలోనూ అదే పరిస్థితి. మేకు సంబంధించి రుపాయికే కిలో బియ్యం పంపిణీ 17వ తేదీతో ముగిసింది. 18 నుంచి నెలాఖరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికి ఇప్పటివరకు సరకు దుకాణాలకు చేరలేదు. రెండు నెలల బియ్యం ఒకేసారి ఇస్తారనే ఆలోచనతో కార్డుదారులు రేషన్‌ దుకాణాలు, ఎండీయూ ఆపరేటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  

అధికారులు   ఏమంటున్నారంటే..
పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి పీఎంజీకేవై బియ్యం కేటాయింపులు ఇంకా జరగలేదని పల్నాడు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి.మోహనబాబు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఉన్నత స్థాయి నుంచి ఉత్తర్వులు అందితే ఆర్‌వోలు (రిలీజ్‌ ఆర్డర్లు) జారీ చేసి గోదాముల నుంచి రేషన్‌ దుకాణాలకు ఉచిత బియ్యం చేరవేస్తామని పౌర సరఫరాల సంస్థ పల్నాడు జిల్లా మేనేజర్‌ జి.వరలక్ష్మి చెప్పారు. ఏప్రిల్‌, మే నెలల పీఎంజీకేవై బియ్యం పంపిణీపై మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని