logo

బాలికతో వాలంటీరు అసభ్య ప్రవర్తన

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఒక గ్రామంలో  ఏడోతరగతి చదువుతున్న బాలిక (13)పై గ్రామానికి చెందిన వాలంటీరు అసభ్యంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో

Published : 20 May 2022 04:15 IST

పెదనందపాడు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ఒక గ్రామంలో  ఏడోతరగతి చదువుతున్న బాలిక (13)పై గ్రామానికి చెందిన వాలంటీరు అసభ్యంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో వాలంటీరుగా పనిచేస్తున్న కూరపాటి ఆనంద్‌బాబు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలికను ఇంటికి పిలిచారు. గతంలో ఆ ప్రాంతంలో పిల్లలకు ట్యూషన్‌ చెబుతూ పరిచయం ఉండటంతో బాలిక వెళ్లింది. ఆ సమయంలో వాలంటీరు బాలికతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని బాలిక బంధువు ఒకరు గమనించి వెంటనే ఆమెను మరోదారి గుండా పంపించేశారు. ఈ విషయాన్ని బయటికి చెబితే ఏదైనా చేస్తానని బాలికను వాలంటీరు బెదిరించారు.  బాలిక తల్లిదండ్రులు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తారు. ఈక్రమంలో బుధవారం రాత్రి బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి బాపట్ల న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు నమోదుచేసిన పోలీసులు విషయం బహిర్గతం కాకుండా గోప్యంగా ఉంచారు. దీంతో గురువారం రాత్రి వరకు విషయం వెలుగులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని