logo

సికింద్రాబాద్‌- కటక్‌ మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-కటక్‌ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. 07581/07582 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల

Updated : 20 May 2022 04:22 IST

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-కటక్‌ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. 07581/07582 నంబరు గల ప్రత్యేక రైలు ఈ నెల 21వ తేదీ ఉదయం 8.30కి సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.15కి కటక్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు కటక్‌లో 22వ తేదీ సాయంత్రం 6.55కి బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 5.20కి సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ రైలు వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, జ, శ్రీకాకుళంరోడ్డు మీదుగా భువనేశ్వర్‌ చేరుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని