logo

కర్రసాము పోటీల్లో పతకాల పంట

కాకినాడలో ఈనెల 8న జరిగిన రాష్ట్ర స్థాయి కర్రసాము చాంఫియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరుకు చెందిన క్రీడాకారులు పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కొర్రపాటి చంద్రశేఖర్‌ రెండు పసిడి, ఒక రజత, మన్నవ మనీషా

Published : 20 May 2022 04:15 IST

తాము సాధించిన పతకాలతో క్రీడాకారులు

గుంటూరుక్రీడలు, న్యూస్‌టుడే: కాకినాడలో ఈనెల 8న జరిగిన రాష్ట్ర స్థాయి కర్రసాము చాంఫియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరుకు చెందిన క్రీడాకారులు పసిడి, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. కొర్రపాటి చంద్రశేఖర్‌ రెండు పసిడి, ఒక రజత, మన్నవ మనీషా వెంకటసాయి మూడు పసిడి, ఖరీదు సాంబయ్య మూడు పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు. అదేవిధంగా రాజస్థాన్‌లోని జయపూర్‌లో ఈనెల 14న జరిగిన జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో చంద్రశేఖర్‌ ఒక పసిడి, ఒక రజత, మనీషా రెండు పసిడి, సాంబయ్య మూడు పసిడి పతకాలు సాధించారు. టీచర్స్‌ కాలనీ వాకింగ్‌ ట్రాక్‌కు చెందిన ఈ ముగ్గురు క్రీడాకారులు జులై 28న నేపాల్‌లోని ఖాట్మండ్‌లో జరిగే అంతర్జాతీయ చాంఫియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని