logo

మానవత్వం చాటుకున్న మంత్రి రజని

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లీ, కుమార్తెలకు ధైర్యం చెప్పి, వారిని శరవేగంగా ఆసుపత్రిలో చేర్చడంలో చొరవ చూపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడకు

Updated : 20 May 2022 04:21 IST

దగ్గరుండి బాధితులను అంబులెన్సులోకి ఎక్కిస్తున్న మంత్రి రజని

పెదకాకాని, న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తల్లీ, కుమార్తెలకు ధైర్యం చెప్పి, వారిని శరవేగంగా ఆసుపత్రిలో చేర్చడంలో చొరవ చూపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడకు చెందిన నూర్జాహాన్‌ తాను కొత్తగా కొనుగోలు చేసిన స్కూటీపై గురువారం తన తల్లి ఉమెరాతో కలిసి పెదకాకానిలోని బాజిబాబా దర్గాకి వెళ్లారు. అక్కడ వాహన పూజ చేయించిన అనంతరం తిరిగి వారు ఇంటికి బయలుదేరారు. నంబూరు సమీపంలోని రెయిన్‌ట్రీ పార్కు వద్దకు వచ్చేసరికి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో వారిరువురికీ గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న మంత్రి విడదల రజని తన వాహనాన్ని ఆపి, క్షతగాత్రుల వద్దకు వెళ్లి, వారికి ధైర్యం చెప్పారు. అక్కడికి 108 అంబులెన్స్‌ వచ్చేవరకు ఆమె అక్కడే ఉండి, తన వ్యక్తిగత సిబ్బందితో క్షతగాత్రులను అందులోకి ఎక్కించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంటుకు ఫోన్‌ చేసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని