logo
Published : 21 May 2022 04:06 IST

చరవాణి సందేశాలే పట్టిచ్చాయి

యువతి ఆత్మహత్య  కేసులో నిందితుడి అరెస్టు

పెదకాకాని, న్యూస్‌టుడే: చరవాణి సందేశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పెదకాకాని పోలీసులు 8 నెలల క్రితం జరిగిన ఓ యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. సీఐ సురేష్‌బాబు శుక్రవారం తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం చిలకలూరిపేటలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న ప్రతాప్‌ 2019లో తనకు బాబాయి వరుసయ్యే వ్యక్తి ఇంట్లో (గుంటూరు శివారు గడ్డిపాడు)లో కొన్ని నెలలు నివాసం ఉన్నాడు. ఆ సమయంలో ఆయన కుమార్తె, తనకు సోదరి వరసయ్యే యువతి(19)కి మాయమాటలు చెప్పి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి, 2021లో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. యావత్తు అంశాలపై మనస్తాపానికి గురైన ఆ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ యువతి చరవాణిని స్వాధీనం చేసుకుని, అందులోని సమాచారాన్ని విశ్లేషించారు. ఈ క్రమంలోనే ఆమెకు, ప్రతాప్‌కు నడుమ అధికంగా ఫోన్‌ ‘ఛాటింగ్‌’ జరిగిందని, తుదకు ప్రతాప్‌ తన వివాహం జరిగిన రోజు అర్ధరాత్రి కూడా ఆమెతో సందేశాలు పంచుకున్నాడని గుర్తించారు. ఆధారాలతో ప్రతాప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తన వల్లే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్టు నేరం అంగీకరించాడని సీఐ చెప్పారు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసినట్టు వివరించారు. 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని