logo

చిచ్చుపెట్టిన క్రికెట్‌ .. మహిళ ఆత్మహత్య

భార్యాభర్తల మధ్య ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చిచ్చుపెట్టాయి. మహిళ ఆత్మహత్యకు దారితీసింది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు ఏటీ అగ్రహారంలో ఉంటున్న ఓ

Published : 21 May 2022 04:06 IST

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే : భార్యాభర్తల మధ్య ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చిచ్చుపెట్టాయి. మహిళ ఆత్మహత్యకు దారితీసింది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుంటూరు ఏటీ అగ్రహారంలో ఉంటున్న ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌తో మంగళగిరి మండలం ఎర్రబాలేనికి చెందిన విశ్రాంత విద్యుత్‌ లైన్‌మెన్‌ కుమార్తెకు 2019లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. గురువారం అర్ధరాత్రి వరకు భర్త ఇంట్లో ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు క్రికెట్‌ చూస్తుంటే ఆరోగ్యం పాడైపోతుందని, టీవీ కట్టేసి వచ్చి నిద్రపొమ్మని భార్య చెప్పింది. నేను అలసిపోయి వచ్చాను...కొద్దిసేపు మ్యాచ్‌ చూసి వస్తానని...నీవు వెళ్లి పడుకోమని భర్త చెప్పాడు. దీంతో ఆమె కోపంతో విసురుగా ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకొని చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. భర్త వెళ్లి తలుపు కొడితే తీయక పోవడంతో కిటికీలో నుంచి చూడగా ఆమె ఉరి వేసుకోవడంతో నిర్ఘాంతపోయాడు. తలుపులు పగలకొట్టి లోపలకు వెళ్లిన భర్త స్థానికుల సహాయంతో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలపడంతో భర్త కన్నీటి  పర్యంతమయ్యాడు. 3 సంవత్సరాల కుమార్తెతోపాటు ఎనిమిది నెలల పసికందు తల్లిప్రేమకు దూరమవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం సీఐ హైమారావు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని