logo

అనుమతి పేరుతో అడ్డగోలుగా.. తరలిపోతున్న చెరువు మట్టి

కుర్నూతల గ్రామంలోని పంట నీటి చెరువు (మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంక్‌) నుంచి అనుమతి పేరుతో రూ.లక్షల విలువైన మట్టి అక్రమ మార్గంలో తరలిపోతోంది. వందెకరాల్లో విస్తరించిన పంట నీటి చెరువులో

Published : 21 May 2022 04:06 IST

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: కుర్నూతల గ్రామంలోని పంట నీటి చెరువు (మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంక్‌) నుంచి అనుమతి పేరుతో రూ.లక్షల విలువైన మట్టి అక్రమ మార్గంలో తరలిపోతోంది. వందెకరాల్లో విస్తరించిన పంట నీటి చెరువులో మట్టిని అనుబంధ మాగాణిలో వేసి, మెరక చేసుకొని పంటలు పండించుకుంటామని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆరుగురు రైతుల పేరుతో దరఖాస్తు చేశారు. దాన్ని పరిశీలించిన మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెరువు నుంచి 12,500ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తరలింపునకు అనుమతి మంజూరు చేశారు. ఇదే సాకుగా రోజుకు 1200 ట్రాక్టర్ల చొప్పున గత నాలుగు రోజులుగా అక్రమ మార్గంలో (16 నుంచి 19 వరకు) గారపాడు, పుల్లడిగుంట, కోయవారిపాలెం, వింజనంపాడు, కొర్నెపాడు గ్రామాల పంట పొలాలు, నివాస గృహాల నిర్మాణాలకు మట్టిని తరలించారు. ఒక్కో ట్రాక్టర్‌లో మట్టి నింపడానికి రూ.250 చొప్పున జేసీబీ, సీనరేజ్‌ వసూలు చేశారు. ఎక్కువ ట్రిప్పులతో అధికాదాయం పొందాలన్న దురాశతో ట్రాక్టర్‌ చోదకులు వాహనాలను వేగంగా నడపడంతో పుల్లడిగుంట ఐదోమైలు నుంచి చింతపల్లిపాడు వరకు రోడ్డంతా మట్టి పెల్లలు జారిపడ్డాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ మట్టి తడవడంతో ఈ మార్గంలో అనేక మంది ద్విచక్ర వాహనాల చదకులు జారి పడుతూ గాయాలపాలవుతున్నారు. దీనిపై న్యూస్‌టుడే మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంక్‌ ఏఈ నవీన్‌ను వివరణ కోరగా, చెరువు మట్టిని ఇదే చెరువుకు అనుబంధంగా ఉన్న పొలాల్లో చవుడు నివారణకు ఇచ్చామని చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని