logo

జిల్లాలో సగటున 2.3 మి.మీ వర్షపాతం

జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు 9, తెనాలి 6.8, గుంటూరు పశ్చిమ 5.2, ఫిరంగిపురం 3.8,

Published : 21 May 2022 04:06 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 2.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు 9, తెనాలి 6.8, గుంటూరు పశ్చిమ 5.2, ఫిరంగిపురం 3.8, వట్టిచెరుకూరు 3.8, గుంటూరు తూర్పు 2.4, పొన్నూరు 2.4, పెదనందిపాడు 2, కొల్లిపర 1.8, దుగ్గిరాల 1.6, మేడికొండూరు 1.4, పెదకాకాని 0.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ వేడి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం, గాలి వీయడంతో ఉపశమనం పొందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని