తెనాలిలో క్రికెట్ బుకీ అరెస్టు

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్లో ..

Updated : 21 May 2022 04:53 IST

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్ పోటీల నేపథ్యంలో పెద్దఎత్తున బెట్టింగు నిర్వహిస్తున్న ఓ బుకీని గుంటూరు జిల్లా, తెనాలి వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన సమావేశంలో డీఎస్పీ డాక్టర్‌ కె.స్రవంతిరాయ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని ఉప్పుబజార్‌లో ఉన్న ఓ ఇంటిలో బెట్టింగ్‌ జరుగుతోందన్న సమాచారంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్‌ నమోదుల ప్రధాన బుకీ జి.వెంకట్, అతని సహాయకుడు వెంకటేష్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక ల్యాప్‌ట్యాప్, 8 స్మార్ట్‌ఫోన్లు, 9 కీప్యాడ్‌ ఫోన్లను కలిగి ఉన్న లైన్‌ బాక్స్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన వెంకట్ గతంలోనూ ఈ తరహా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. చరవాణులు, ఇతర సాంకేతిక పరికరాల విశ్లేషణ తర్వాత ఇందులో ఎంత మంది పాల్గొన్నారు? వారు ఎవరు? ఏమేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి.. తదితర సమాచారాన్ని సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వన్‌టౌన్‌ పోలీసులను ఆమె అభినందించారు. సమావేశంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు ఉమామహేశ్వరరావు, చాణక్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రధాన నిందితుడు వెంకట్ బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్‌ నిర్వహిస్తుంటాడని, ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ అతని సిబ్బంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పక్కా సాక్ష్యాధారాలు సేకరించే పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని