logo

పదిరోజుల్లో కాలువల పనులు ఎలా?

కాలువలకు జూన్‌ 10 నుంచి నీరు విడుదల చేస్తారు.. జూన్‌ 1వ తేదీ నుంచి కెనాల్స్‌లో పనులు మొదలుపెడితే పదిరోజుల్లో వాటిని ఎలా పూర్తిచేస్తారని జలవనరుల శాఖ అధికారులను వ్యవసాయ

Published : 21 May 2022 04:24 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే : కాలువలకు జూన్‌ 10 నుంచి నీరు విడుదల చేస్తారు.. జూన్‌ 1వ తేదీ నుంచి కెనాల్స్‌లో పనులు మొదలుపెడితే పదిరోజుల్లో వాటిని ఎలా పూర్తిచేస్తారని జలవనరుల శాఖ అధికారులను వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్‌ నల్లమోతు శివరామకృష్ణ ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన అన్ని రకాల సామగ్రి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీసీఆర్‌సీ కార్డుల జారీలో భూ యజమానులను చైతన్య పరచాలన్నారు. క్షేత్రస్థాయిలో ఈ అంశంపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య మాట్లాడుతూ ఉద్యాన శాఖ పథకాలు పెద్ద పెద్ద రైతులకే తప్ప సన్న, చిన్నకారు రైతుల దరిచేరడం లేదన్నారు. అనంతరం ఖరీఫ్‌ ప్రణాళికలకు సంబంధించిన వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా వ్యవసాయశాఖాధికారి నున్న వెంకటేశ్వర్లు వివరించారు. ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ జి.శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని