logo

23న అంబేడ్కర్‌ గుడి ప్రారంభం

పల్నాడుజిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో ఈనెల 23న అంబేడ్కర్‌ గుడిని ప్రారంభించనున్నామని ఏపీ అంబేడ్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ గోళ్లమూడి

Published : 22 May 2022 04:17 IST

గుంటూరు(అరండల్‌పేట), న్యూస్‌టుడే: పల్నాడుజిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెనలో ఈనెల 23న అంబేడ్కర్‌ గుడిని ప్రారంభించనున్నామని ఏపీ అంబేడ్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ గోళ్లమూడి రాజసుందరబాబు తెలిపారు. శనివారం గుంటూరులోని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్‌ గుడి ప్రారంభోత్సవ గోడప్రతులను మంత్రి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజసుందరబాబు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కలిగిన ప్రయోజనాలు, సామాజిక న్యాయం దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు పెదమక్కెన గ్రామ దళితులు 27 అడుగుల గుడిని కట్టించారని తెలిపారు. గుడి ప్రారంభోత్సవం సందర్భంగా కులాంతర, మతాంతర వివాహాలు జరపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మద్దు ప్రేమజ్యోతిబాబు, గాలి రాము, దుగ్గెంపూడి శ్రీనివాసరెడ్డి, మార్కు, ఓబయ్య, తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని