logo

పంటల రుణ ప్రణాళిక

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. వ్యవసాయ ప్రాధాన్యం కలిగిన జిల్లాలు కావడంతో పంటరుణాలకు పెద్దఎత్తున నిధులు

Published : 22 May 2022 04:19 IST

సాగును ప్రోత్సహించేలా నిధులు

ఈనాడు, గుంటూరు: గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. వ్యవసాయ ప్రాధాన్యం కలిగిన జిల్లాలు కావడంతో పంటరుణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించారు. సొంత భూములున్న రైతులతోపాటు కౌలు రైతులు, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీలలో సభ్యులుగా ఉన్న రైతులకు కూడా రుణాల లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లా లీడ్‌బ్యాంక్‌ మేనేజరు ఆయా జిల్లాలకు రుణ ప్రణాళికను సిద్ధం చేయగా, ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చించి రుణ ప్రణాళికను ఖరారు చేస్తారు. జూన్‌ నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెలాఖరులోగా రుణ ప్రణాళికను ఖరారు చేయాల్సి ఉంది. సీజన్‌ మొదలైతే రైతులు విత్తనాలు, ఎరువులు, భూమి సిద్ధం చేసుకోవడానికి సొమ్ము అవసరమవుతుంది. పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలో మిర్చి సాగు ఎక్కువ. అదేవిధంగా పత్తి సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. మిర్చి సాగుకు ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి అవసరమవుతున్న నేపథ్యంలో ఆ మేరకు బ్యాంకులు రుణాలు మంజూరుకు ఇప్పటికే అంగీకారం తెలిపాయి. పంట రుణాలతోపాటు భూముల చదునుకు వ్యవసాయ సంబంధిత పరికరాల కొనుగోలుకు కూడా బ్యాంకులు రుణాలు కేటాయించాయి. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడిపరిశ్రమ, మత్స్యపరిశ్రమకు సంబంధించి ప్రత్యేకంగా సొమ్ము కేటాయించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధం రంగాలకు మూడు జిల్లాల్లో కలిపి పెద్దఎత్తున రుణాలు ఇవ్వనున్నారు. గతేడాది తీసుకున్న రుణాల రెన్యువల్‌తోపాటు కొత్త రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ప్రణాళిక సిద్ధం చేశాయి. ఉద్యాన పంటల సాగు రైతులకు రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఉద్యానశాఖ కూడా ఈ ఏడాది వెదురు, డ్రాగన్, ఆయిల్‌పామ్‌ వంటి కొత్త పంటలను సాగుదారులను ప్రోత్సహిస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని