logo

అసైన్డు భూముల్లో మళ్లీ తవ్వకాలు

అక్రమార్కులు మళ్లీ అసైన్డు భూముల్లో తవ్వకాలు ప్రారంభించారు. ఈ విషయంపై ఇటీవల ‘ఈనాడు’లో వచ్చిన వరుస కథనాల నేపధ్యంలో గత నెల 16 నుంచి 30 వరకు నలుగురు అధికారులను వీఎన్‌ పాలెంలోని

Published : 22 May 2022 04:24 IST

న్యూస్‌టుడే- చేబ్రోలు: అక్రమార్కులు మళ్లీ అసైన్డు భూముల్లో తవ్వకాలు ప్రారంభించారు. ఈ విషయంపై ఇటీవల ‘ఈనాడు’లో వచ్చిన వరుస కథనాల నేపధ్యంలో గత నెల 16 నుంచి 30 వరకు నలుగురు అధికారులను వీఎన్‌ పాలెంలోని క్వారీల వద్ద కాపలాగా ఉంచారు. గత రాత్రి నుంచి మళ్లీ అసైన్డు భూముల్లోని మట్టిని తవ్వి తరలిస్తున్నారు. శనివారం అక్కడ నిఘా విధులు నిర్వహిస్తున్న మైనింగ్‌ ఆర్‌ఐ శివపార్వతి అక్కడికి చేరుకుని మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు.

అధికారులపై ఆగ్రహం.. వీఎన్‌ పాలెంలో సర్వే నంబరు ‘502-ఎ’లో 0.46 ఎకరాల్లో 15 రోజుల పాటు మట్టిని తవ్వుకునేందుకు మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. ఇదే అదనుగా భావించి పక్కనే ఉన్న అసైన్డు భూముల్లో మట్టిని తరలిస్తుండగా ఆర్‌ఐ శివపార్వతి, విజిలెన్స్‌ ఐజి కొండారెడ్డి అక్కడికి చేరుకుని మట్టి తవ్వకాలను నిలిపి వేశారు. దీంతో మట్టిని తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్న ఓ ప్రజాప్రతినిధి బంధువు అక్కడికి చేరుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి తీసుకున్న పొలం నుంచి మట్టిని తరలించేందుకు అసైన్డు భూముల్లో నుంచి దారి ఏర్పాటుచేసుకొంటున్నామనీ, మట్టిని తరలించడంలేదని పేర్కొంటూ అధికారులపై మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని