logo

బ్యారేజీ ఆప్రాన్‌ అంతేనా!

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ ఆప్రాన్‌ దిమ్మెలు వరదల ప్రవాహానికి ఎగుడు దిగుడుగా మారాయి. కొన్నిచోట్ల పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి.

Published : 23 May 2022 05:11 IST


ఎగుడు, దిగుడుగా దిమ్మెలు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ ఆప్రాన్‌ దిమ్మెలు వరదల ప్రవాహానికి ఎగుడు దిగుడుగా మారాయి. కొన్నిచోట్ల పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. 2009 వరదల సమయంలో ఆప్రాన్‌ పూర్తిగా దెబ్బతింది. 2016లో భారీ యంత్రాల సాయంతో దిమ్మెలను క్రమపద్దతిలో అమర్చి, కాంక్రీటు ఫిల్లింగ్‌ చేసి వరద వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా అడ్డుగా గోడ నిర్మించారు. బ్యారేజి గేట్లకు కూడా మరమ్మతులు చేశారు. తర్వాత పలుసార్లు వచ్చిన వరదల ఉద్ధృతికి బ్యారేజీ ఒకటో గేటు నుంచి 51వ గేటు వరకు ఉనన ఆప్రాన్‌ ప్రాంతం మొత్తం మళ్లీ దెబ్బతింది. కొన్నిచోట్ల దిమ్మెలు కొట్టుకుపోయాయి. రెండు జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ప్రకాశం బ్యారేజీ ఆప్రాన్‌ పటిష్ఠానికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.


చప్టా వద్ద ఏర్పడిన భారీ గొయ్యి

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని