logo
Published : 23 May 2022 05:11 IST

కర్షకులకు కలిసొచ్చిన రబీ

జొన్న, మొక్కజొన్న సాగుదారులకు ఊరట

ఈనాడు, అమరావతి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు, కృష్ణాపశ్చిమ డెల్టాలో రబీ సీజన్‌లో జొన్న, మొక్కజొన్న సాగుచేసిన కర్షకులకు కలిసొచ్చింది. ఖరీఫ్‌లో వర్షాలతో కోతకు వచ్చిన వరి పంట నేలవాలి ధాన్యం నీటిలో తడిసి రంగు మారింది. ధాన్యం నాణ్యత దెబ్బతినడంతో రైతులకు పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి. అయితే రబీ సీజన్‌లో జొన్న, మొక్కజొన్న సాగుచేసిన రైతులకు కొంత ఊరట లభించింది. తెల్లజొన్న, మొక్కజొన్న సాగుదారులు ఖరీఫ్‌ సీజన్‌లో నష్టాన్ని పూడ్చుకోవడంతోపాటు కొంతసొమ్ము మిగిలింది. పల్నాడులో సాగర్‌ కాలువల కింద మాగాణి భూముల్లోనూ కొందరు ఈసారి మొక్కజొన్న సాగుచేశారు. వీరికి మంచి దిగుబడులు వచ్చాయి. క్వింటా రూ.2వేలకుపైగా అమ్మడంతో పెట్టుబడులు పోగా సొమ్ము మిగిలింది.

నీటి వసతి ఉన్న భూముల్లోనూ..

పల్నాడు ప్రాంతంలో సాగర్‌ కాలువల కింద నీటివసతి ఉన్న భూముల్లో కంది పంటకు బదులుగా ఈసారి కొందరు మొక్కజొన్న వేశారు. ప్రకృతి సహకరించడంతో దిగుబడులు ఎకరాకు సగటున 35 క్వింటాళ్ల వరకు వచ్చాయి. మాగాణి భూముల్లో వరి తర్వాత రెండోపంటగా మినుము బదులు మొక్కజొన్న వేశారు. డిమాండ్‌ ఉండటంతో సరకు తయారైన వెంటనే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఒక పంట మాత్రమే సాగుచేసిన వారికి ఎకరాకు రూ.30వేలకుపైగా సొమ్ము మిగిలింది. నువ్వులు సాగుచేసిన వారికి కూడా ధరలు బాగుండటం కలిసొచ్చింది. మినుము సాగు చేసిన వారికి ఈసారి పెట్టుబడి ఖర్చులు పెరగడంతో పెద్దగా సొమ్ము మిగలలేదు. వరి సాగు వల్ల పెద్దగా ఆదాయం లేకపోవడం, ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఈసారి సాగర్‌ కుడికాలువల కింద మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని