logo

పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చ

సమాజంలో ఇటీవలి కాలంలో పెరిగిపోయిన పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చ అని ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కేఎస్‌ లక్ష్మణరావులు పేర్కొన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జాషువా పెరియార్‌ ఫులె లిటరేచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని హోటల్లో చితి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కవి బి.విల్సన్‌ అధ్యక్షత వహించారు.

Published : 23 May 2022 05:31 IST

ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కేఎస్‌ లక్ష్మణరావు


చితి పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కేఎస్‌ లక్ష్మణరావు, కవి పాపినేని శివశంకర్‌ తదితరులు

గుంటూరు (ఏ.టి.అగ్రహారం), న్యూస్‌టుడే: సమాజంలో ఇటీవలి కాలంలో పెరిగిపోయిన పరువు హత్యలు నాగరిక సమాజానికి మాయని మచ్చ అని ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, కేఎస్‌ లక్ష్మణరావులు పేర్కొన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జాషువా పెరియార్‌ ఫులె లిటరేచర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులోని హోటల్లో చితి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి కవి బి.విల్సన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాణిక్య వరప్రసాద్‌, లక్ష్మణరావులు మాట్లాడుతూ పరువు హత్యలు నేపథ్యంగా ప్రముఖ రచయిత పెరమాల్‌ మురుగన్‌ రచించిన చితి పుస్తకాన్ని ఆవిష్కరించడం సందర్భోచితంగా ఉందన్నారు. పరువు హత్యల నివారణకు ప్రత్యేక చట్టాలు, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి పాపినేని శివశంకర్‌ మాట్లాడుతూ చిన్న కులాల వారే ఎక్కువగా పరువు హత్యలకు గురవుతున్నారని వివరించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అగ్రకుల ఉన్మాదంతో చేసే వాటిని పరువు హత్యలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. సభ్య సమాజం మొత్తం పరువు హత్యలను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ కార్యదర్శి బి.శ్యాంబాబు, డాక్టర్‌ డి.సి.హెచ్‌.అంజయ్య, కాపు శ్రీనివాస్‌, కన్న మాస్టారు, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మధు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని