logo

‘దుల్హన్‌ పథకం రద్దు సిగ్గుచేటు’

దుల్హన్‌ పథకాన్ని రద్దు చేయడం సిగ్గుచేటని, దీంతో ముస్లిం మైనార్టీలు ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక లాడ్జికూడలిలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం

Published : 25 Jun 2022 05:35 IST

మాట్లాడుతున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

బ్రాడీపేట, న్యూస్‌టుడే: దుల్హన్‌ పథకాన్ని రద్దు చేయడం సిగ్గుచేటని, దీంతో ముస్లిం మైనార్టీలు ప్రభుత్వ తీరుపై రగిలిపోతున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక లాడ్జికూడలిలోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో జగనన్న సంక్షేమ పథకాల రద్దు పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ముస్లిం ఆడబిడ్డల పెళ్లికి గత ప్రభుత్వం ఇచ్చే రూ.50 వేలు కాకుండా వైకాపా ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ దుల్హన్‌ పథకం పేరుతో రూ.లక్ష ఇస్తామని ముస్లిం మైనార్టీలకు మాట ఇచ్చారాని, మూడేళ్లుగా ఆ పథకాన్ని అమలు చేయకపోగా, ఇప్పుడా పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామమని చెప్పడం ఆయా వర్గాలను మోసం చేయడమేనన్నారు. రోజుకో నిబంధన పేరుతో పేదలకు, అర్హులకు అమ్మఒడి, చేయూత, ఆసరా పథకాలను దూరం చేశారు. ప్రభుత్వం మూడేళ్లుగా సంక్షేమం పేరుతో రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’.. అని డిమాండ్‌ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ ఏ రాష్ట్రానికైనా.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల వంటివని, వైకాపా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అనే కంటిని పూర్తిగా గుడ్డిదాన్నిగా మార్చారని విమర్శించారు. ముస్లిం, మైనార్టీ ప్రజలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మూడేళ్లలో ఎందుకు అమలు చేయలేదని గట్టిగా నిలదీయాలని కోరారు. సమావేశంలో జనసేన నాయకులు బి.మల్లిక, నారాదాసు ప్రసాద్‌, షేక్‌ ఆసియా, మధులాల్‌, షర్ఫుద్దీన్‌, బాలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని