పల్నాడులో లోకేశ్ పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు
చంద్రబాబుతో యరపతినేని భేటీ
చంద్రబాబుతో మాట్లాడుతున్న యరపతినేని శ్రీనివాసరావు, పక్కన అచ్చెన్నాయుడు
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: పల్నాడులో లోకేశ్ చేసిన పర్యటనతో వైకాపా నేతల వెన్నులో వణుకు పుడుతుందని తెదేపా సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెదేపా జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన అధినేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును కలసి పల్నాడులో పరిస్థితులు, లోకేశ్ పర్యటనకు ప్రజల్లో నుంచి అనూహ్య స్పందన, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పల్లె పిలుస్తోంది, పల్లెనిద్ర కార్యక్రమాలపై మాట్లాడారు. ‘జల్లయ్య హత్య పట్ల పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీసింది. కర్మకాండలకు, పెద్దకర్మకు లోకేశ్ హాజరై రూ.25 లక్షలకు ఆర్థిక సహాయం చేయడం కార్యకర్తల్లో, జల్లయ్య కుటుంబంలో మనోధైర్యం నింపింది. లోకేశ్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని ప్రభుత్వం భావించినా గురజాల, మాచర్లలో కార్యకర్తలు ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి నీరాజనం పట్టారు. గతంలో ఎన్టీఆర్, మీరు పల్నాడు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలు ఏవిధంగా స్వచ్ఛందంగా తరలివచ్చారో లోకేశ్ పర్యటనలకు ఆవిధంగా వచ్చారు. గురజాలలో అధికార పార్టీ నేతల నుంచి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యకర్తలతో పాటు నేను కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నా’...అని చంద్రబాబు దృష్టికి యరపతినేని తీసుకువెళ్లారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ ‘కార్యక్రమాన్ని అంతా నేను గమనించాను. ముఖ్యంగా పిడుగురాళ్లలో బాగా చేశారు. ప్రతిఒక్కరూ మీ వలే పని చేసి కార్యకర్తల్లో ధైర్యం నింపాలి. అండగా ఉండాలి. పల్లె పిలుస్తోంది, పల్లె నిద్ర కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. ఇదే పంథాను ఎన్నికల వరకు కొనసాగించాలి. మీరు కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా’..అని యరపతినేనిని అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Freebies: ఉచిత హామీలు కురిపించిన వారంతా ఎన్నికల్లో గెలవట్లేదు కదా..!
-
Technology News
YouTube: ఓటీటీ తరహా సేవలతో యూట్యూబ్ ఆన్లైన్ స్టోర్!
-
Movies News
SIIMA: సైమా 2022.. ఈ సారి పోటీ పడనున్న చిత్రాలివే
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
China: మా నౌక ఏ దేశ భద్రతకు ముప్పుకాదు: చైనా
-
Technology News
iPhone 14: యాపిల్ ఈవెంట్ జరిగేది అప్పుడేనా.. ఐఫోన్ 14తోపాటు ఇంకా ఏం విడుదలవుతాయ్?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- స్తంభనలోపాన్ని కట్టేయండి
- Hrithik Roshan: హృతిక్! ముందు నీ సినిమా సంగతి చూసుకో..
- Pak PM: ఆసియా టైగర్ అవుతామనుకున్నాం.. కానీ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం
- Hyderabad News: అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్వేర్ ఇంజినీరు మృతి
- Noida Twin Towers: అమాంతం నీరు కిందికి దుమికినట్లు.. భవనాలు కుప్పకూలుతాయి..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (17/08/2022)
- TSRTC: హైదరాబాద్లో ఇకపై ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం..
- IND vs ZIM : జింబాబ్వే వంటి జట్లతో ఆడటం.. ప్రపంచ క్రికెట్కు మంచిది!
- Offbeat: 99ఏళ్ల బామ్మ.. 100వ మునిమనవడిని కలిసిన వేళ!
- Dhanush: ధనుష్ రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా?