logo

అత్యవసరమైతే చేతులెత్తేయాల్సిందే..

జిల్లా కేంద్రం బాపట్లలోని ప్రాంతీయ వైద్యశాలకు అంబులెన్స్‌ సమకూర్చడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. రోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. పాత అంబులెన్స్‌ నాలుగేళ్ల కిత్రమే దెబ్బతింది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, అత్యవసర

Published : 25 Jun 2022 05:35 IST

జిల్లా ఆసుపత్రిలోఅంబులెన్స్‌ కరవు

బాపట్ల, న్యూస్‌టుడే

జిల్లా కేంద్రం బాపట్లలోని ప్రాంతీయ వైద్యశాలకు అంబులెన్స్‌ సమకూర్చడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు. రోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. పాత అంబులెన్స్‌ నాలుగేళ్ల కిత్రమే దెబ్బతింది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించడానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకుండా పోయింది. 108 వాహనం ఒక్కసారి గుంటూరు వెళ్తే మరో వాహనం మూడు గంటల వరకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రోగులు ప్రైవేటు అంబులెన్స్‌కు రూ.3 వేలు చెల్లించి జీజీహెచ్‌, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. రాత్రులు అందుబాటులో లేక ప్రైవేటు వాహనం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. వాహనం రావడంలో జాప్యం జరిగి విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఈ సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రాంతీయ వైద్యశాలకు అంబులెన్స్‌ కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని