logo

రూ.1.91 లక్షలకు ఆన్‌లైన్‌ మోసం

తాడేపల్లి పరిధిలోని నులకపేటకు చెందిన ఓ యువతి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రూ.1.91లక్షలు నగదును స్వాహా చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని వచ్చిన లింకును ఓపెన్‌ చేయడంతో

Published : 25 Jun 2022 05:35 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే : తాడేపల్లి పరిధిలోని నులకపేటకు చెందిన ఓ యువతి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌ ద్వారా రూ.1.91లక్షలు నగదును స్వాహా చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చని వచ్చిన లింకును ఓపెన్‌ చేయడంతో టాస్క్‌ ఇచ్చారు. ముందుగా కొంత డిపాజిట్‌ చెలించాలని సూచించారు. ఇందులో భాగంగా రూ.60వేలు చెల్లించాలన్నారు. దీనికి రూ.20వేలు బోనస్‌ కలిపి ఇస్తామన్నారు. వారు చెప్పిన విధంగా లింకును క్లిక్‌ చేస్తే కొన్ని రకాల టాస్క్‌లు ఇచ్చారు. వారిచ్చిన నాలుగు టాస్కుల్లో విజేతగా నిలవడంతో బోనస్‌ రూ.20వేలు వచ్చిందని, మొత్తం రూ.80వేలు తీసుకోవాలంటే ముందుగా కొంత నగదు జమ చేయమన్నారు. వరుసగా చేసిన టాస్కులకు రూ.1.08లక్షలు వచ్చాయని, వాటిని తీసుకోవాలంటే మరో రూ.28వేలు చెలించమన్నారు. వచ్చిన నగదును వదులుకోవడం ఎందుకని వారు అడిగినట్లుగా నగదు చెల్లిస్తూ వచ్చారు. చివరికి రూ.1.91లక్షలు మీఖాతా నుంచి తీసుకోవచ్చని చెప్పినవారు ఖాతా సీజ్‌ చేయబడిందని, దానిని తొలగించాలంటే ఇంకొంత నగదు ఇవ్వమని కోరారు. దీంతో తమ వద్ద అంత నగదు లేదని చెప్పడంతో చెల్లించని పక్షంలో మొత్తం నగదు మురిగిపోతుందని తెలిపారు. తమను మోసం చేస్తున్నాడన్న విషయాన్ని గ్రహించిన యువతి తన భర్త ద్వారా శుక్రవారం గత 15 రోజులుగా జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని