logo

ప్రభుత్వ శ్వాసకోశ, అంటువ్యాధుల ఆసుపత్రిగా మార్పు

ప్రభుత్వ జ్వరాల వైద్యశాలను ప్రభుత్వ శ్వాసకోశ, అంటువ్యాధుల ఆసుపత్రిగా పేరు మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం జీవో జారీ చేశారు. దీనివల్ల ఆసుపత్రిలో అదనంగా

Published : 25 Jun 2022 05:35 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జ్వరాల వైద్యశాలను ప్రభుత్వ శ్వాసకోశ, అంటువ్యాధుల ఆసుపత్రిగా పేరు మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు శుక్రవారం జీవో జారీ చేశారు. దీనివల్ల ఆసుపత్రిలో అదనంగా సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇదే పేరుతో ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్న ఆసుపత్రి ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులకు మెరుగైన చికిత్స ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న విషయాన్ని రోగులకు తెలుస్తుందని సూపరింటెండెంట్‌ రఘు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని