logo

ఆగని సోలార్‌ పరికరాల చోరీలు

వ్యవసాయ సాగులో ముఖ్యభూమిక పోషించే సోలార్‌ పరికరాల చోరీ రోజురోజుకూ హెచ్చరిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది వ్యయంతో ఏర్పాటు చేసుకున్న వీటిలోని విలువైన సామగ్రిని దొంగలు ధ్వంసంచేసి మరీ తీసుకెళ్తున్నారని

Published : 25 Jun 2022 05:35 IST

24 మంది రైతులకు చెందినవి అపహరణ


తీగలను తీసుకెళ్లిన ఫలకల వద్ద చూపుతున్న రైతు కల్లూరి సుబ్బయ్య

ఇసుకదర్శి(మార్టూరు), న్యూస్‌టుడే: వ్యవసాయ సాగులో ముఖ్యభూమిక పోషించే సోలార్‌ పరికరాల చోరీ రోజురోజుకూ హెచ్చరిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షలాది వ్యయంతో ఏర్పాటు చేసుకున్న వీటిలోని విలువైన సామగ్రిని దొంగలు ధ్వంసంచేసి మరీ తీసుకెళ్తున్నారని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మార్టూరు మండలంలోని మార్టూరు, ఇసుకదర్శి, కోనంకి ప్రాంతాల్లో ఈరకం చోరీలు పెరగడంతో పోలీసులకు యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. మళ్లీ గురువారం అర్ధరాత్రి ఇసుకదర్శి ప్రాంతంలోని సుమారు 24 మంది రైతులకు చెందిన సోలార్‌ ఫలకల వద్ద తీగలను గుర్తుతెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. స్థానిక శ్రీరంగ క్షేత్రం నుంచి నాగరాజుపల్లి వెళ్లే మార్గం వెంటున్న పొలాల్లోని సోలార్‌ ఫలకల కింద ఉన్న ఖరీదైన తీగలను తీసుకెళ్లారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మార్టూరు పోలీసులను శుక్రవారం వారు ఆశ్రయించారు. వీరిలో కామేపల్లి సురేంద్రబాబు, కల్లూరి సుబ్బయ్య, రాము తదితరులు తమ పొలాల్లోలోని విలువైన సామగ్రిని గుర్తుతెలియన వ్యక్తులు దొంగిలించారని తెలిపారు.

సౌర ఫలకల వద్ద తీగలు దొంగిలించారంటున్న కామేపల్లి రాము​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని