logo

పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఊరుకోం :మోపిదేవి

వైకాపా పట్ల అసంతృప్తి కార్యక్రమాలకు పాల్పడినా, వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నా కఠినంగా వ్యవహరిస్తామని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ హెచ్చరించారు. సీఎం జగన్‌ అన్నివర్గాల అభ్యున్నతికి అహర్నిశలూ శ్రమిస్తున్న

Published : 25 Jun 2022 05:35 IST

మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి, పక్కన

ఎంపీ నందిగం, నియోజకవర్గ బాధ్యుడు రామనాథం

మార్టూరు, న్యూస్‌టుడే: వైకాపా పట్ల అసంతృప్తి కార్యక్రమాలకు పాల్పడినా, వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నా కఠినంగా వ్యవహరిస్తామని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ హెచ్చరించారు. సీఎం జగన్‌ అన్నివర్గాల అభ్యున్నతికి అహర్నిశలూ శ్రమిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. మార్టూరులోని దుర్గామల్లేశ్వర స్వామి కల్యాణ మండపంలో శుక్రవారం పర్చూరు నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీ నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు ఏవైనా సమస్యలుంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలన్నారు. అంతేకాని వ్యతిరేక కార్యక్రమాలకు నాయకత్వం వహించినా, అలాంటి వారికి మద్దతు పలికినా చూస్తూ ఊరుకునేది లేదని, ఉపేక్షించమని మోపిదేవి సభలో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌ని మళ్లీ సీఎంగా గెలిపించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. గత ఎన్నికల్లో పర్చూరు సీటును స్పల్ప తేడాతో కోల్పోయామని, ఈసారి భారీ ఆధిక్యత చేకూర్చాలన్నారు. ఎంపీ నందిగం సురేశ్‌ మాట్లాడుతూ పర్చూరు వైకాపాలో అంతఃకలహాలు ఎక్కువయ్యాయని, వ్యక్తులను పక్కనపెట్టి పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారిని జగన్‌ మంచి భవిష్యత్తు కల్పిస్తారని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ బాధ్యుడు రావి రామనాథంబాబు, జిల్లా పరిశీలకుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్‌ సహకార సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు అట్లా చినవెంకటరెడ్డి, ప్రకాశం జడ్పీ ఉపాధ్యక్షురాలు చుండి సుజ్ఞానమ్మ, నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని