logo

ఆదర్శ పాఠశాలల సత్తా

అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో ఆధునిక విద్య అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏపీ ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సత్తా చాటాయి. ఆంగ్ల మాధ్యమ బోధన అందిస్తున్న ఈ కళాశాలల

Published : 25 Jun 2022 05:35 IST

క్రోసూరులో ఆదర్శ పాఠశాల

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : అక్షరాస్యత తక్కువగా ఉన్న మండలాల్లో ఆధునిక విద్య అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏపీ ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో సత్తా చాటాయి. ఆంగ్ల మాధ్యమ బోధన అందిస్తున్న ఈ కళాశాలల నిర్వహణ బాధ్యతలు కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే చూస్తోంది. రాష్ట్ర, జిల్లా సగటు ఉత్తీర్ణత శాతం కంటే కొన్ని చోట్ల అధికంగా నమోదైంది. ఉమ్మడి జిల్లాలో 14 ఏపీ ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేయగా అవన్నీ పల్నాడు జిల్లాలోనే ఉన్నాయి.

ఏపీ ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాలు కొంత నిరాశపరిచాయి. 14 కళాశాలల నుంచి 1,112 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 504 మంది ఉత్తీర్ణులై 45.32 శాతం ప్రగతి నమోదైంది. దుర్గి ఆదర్శ కళాశాలలో 80 మంది విద్యార్థులకు 52 మంది ఉత్తీర్ణులై 65 శాతం ప్రగతి నమోదైంది. జెట్టిపాలెం (గోలీ)లో 59 మందికి 11 మంది ఉత్తీర్ణులై 18.64 శాతం ప్రగతి నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని