logo

‘సాకులు చెబుతూ తప్పించుకుంటున్న జగన్‌’

వివిధ కేసుల్లో ఛార్జిషీటు వేసి 12 ఏళ్లయింది.. కోర్టుకు వెళ్లకుండా సాకులు చెబుతూ జగన్‌మోహన్‌రెడ్డి తప్పించుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో

Published : 27 Jun 2022 06:01 IST

కోడెల విగ్రహావిష్కరణలో తెదేపా నేత వర్ల కోడెల విగ్రహం వద్ద ప్రత్తిపాటి, అరవిందబాబు, శివరాం నేతలు

సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: వివిధ కేసుల్లో ఛార్జిషీటు వేసి 12 ఏళ్లయింది.. కోర్టుకు వెళ్లకుండా సాకులు చెబుతూ జగన్‌మోహన్‌రెడ్డి తప్పించుకుంటున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో ఆదివారం దివంగత కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు పూర్తిగా మారారని, పార్టీ శ్రేణులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు.  కోడెల శివరామ్‌ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేదని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ర్యాలీపై రాళ్లేసిన వైకాపా వారిని విడిచిపెట్టబోమన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, నేతలు చదలవాడ అరవిందబాబు, దారూనాయక్‌, కంచేటి శివప్రసాద్‌, మక్కపాటి రామచంద్రరావు, సయ్యద్‌ పెదకరిముల్లా, యర్రా వెంకటేశ్వరరావు, కొల్లు మల్లేశ్వరరావు, షేక్‌ జాని తదితరులు పాల్గొన్నారు.
ప్రత్తిపాటి కారు అద్దం ధ్వంసం : విగ్రహావిష్కరణకు ముందు తెదేపా శ్రేణుల కార్లు, ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన చేస్తుండగా.. కొమెరపూడిలో గుర్తుతెలియని వ్యక్తి పెద్ద రాయిని విసరడంతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కారు అద్దం ధ్వంసమైంది.

‘నాని, వంశీని వదిలిపెట్టం’ : చంద్రబాబుపై నోరుపారేసుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి ఎవరినైనా వదిలిపెట్టబోమని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చంద్రన్నను కన్నీళ్లు పెట్టించిన వారిని, కోడెల శివప్రసాదరావును మానసికంగా వేధించిన వారిని విడిచిపెట్టబోమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని