logo

పంట చేలల్లో మద్యం బాబుల ఆగడాలు

తీరప్రాంతంలో మద్యం బాబుల ఆగడాలకు అడ్డూఆపు లేకుండా పోతోంది. పట్ట పగలు పంట చేలల్లో యథేచ్ఛగా తాగుతున్నారు. ఖాళీ సీసాలను చిందర వందరంగా పడేస్తున్నారు. తమ చేలు మద్యం సీసాలతో నిండిపోవడంతో రైతులు

Published : 27 Jun 2022 06:01 IST

ప్రశ్నించినందుకు రైతుపై సామూహిక దాడి ‌

ఆలస్యంగా వెలుగులోకి ఘటన

నగరం, న్యూస్‌టుడే : తీరప్రాంతంలో మద్యం బాబుల ఆగడాలకు అడ్డూఆపు లేకుండా పోతోంది. పట్ట పగలు పంట చేలల్లో యథేచ్ఛగా తాగుతున్నారు. ఖాళీ సీసాలను చిందర వందరంగా పడేస్తున్నారు. తమ చేలు మద్యం సీసాలతో నిండిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల గుర్తు తెలియని నలుగురు యువకులు నగరం మండలంలోని పూషడపువారిపాలెంలోని రైతు సుబ్బారావు చేలో సిట్టింగ్‌ వేశారు. తాగిన మద్యం సీసాలను చేలల్లో విసిరేయడం గమనించిన ఆ రైతు.. అక్కడికి చేరుకుని ఇదేం పని అని ప్రశ్నించినందుకు మత్తులో ఉన్న మద్యం బాబులు ఆయనపై దాడి చేశారు. పక్కనే ఉన్న మరో రైతు గమనించి పరుగున వచ్చి సుబ్బారావును రక్షించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మందు బాబులు ఇక్కడ.. అక్కడ అని లేకుండా మద్యం తాగుతూ పరిసరాలు, పంట కాలువలను సీసాలు, పెంకులు, గ్లాసులతో నింపేస్తున్నారు. ప్రత్యేకంగా కూలి చెలించి వాటిని తొలగించాల్సిన పరిస్థితులు దాపురించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారులు స్పందించి తమ సమస్య పరిష్కరించాలని విన్నవిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని