logo

పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి పార్టీ రంగులు

దక్షిణ అద్దంకిలో నిర్మాణం పూర్తి చేసుకున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి అధికార పార్టీ రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రూ.80 లక్షలు వెచ్చించి అద్దంకి నగర పంచాయతీలో ఈ నిర్మాణం చేపట్టారు.

Published : 27 Jun 2022 06:01 IST

అద్దంకిలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

అద్దంకి, న్యూస్‌టుడే : దక్షిణ అద్దంకిలో నిర్మాణం పూర్తి చేసుకున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి అధికార పార్టీ రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రూ.80 లక్షలు వెచ్చించి అద్దంకి నగర పంచాయతీలో ఈ నిర్మాణం చేపట్టారు. త్వరలో ప్రారంభోత్సవానికి సిద్దం చేస్తున్న తరుణంలో వైద్యశాలకు రాజకీయ పార్టీ రంగులు వేయడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారులంతా బదిలీల వ్యహారంలో తలమునకలైన నేపథ్యంలో కనీసం ఈ అంశం గురించి పట్టించుకునే వారు లేకపోవటం గమనార్హం. ఇప్పటికే పలుమార్లు అధికారిక భవనాలకు పార్టీ రంగులు వేయడంపై ఇస్సటికే పలుమార్లు న్యాయస్థానాల్లో చుక్కెదురైనా అధికార పార్టీ నాయకుల్లో స్పందన లేకపోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని