సేవలకు స్వచ్ఛ పురస్కారం
ఆ ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలించింది. హెచ్ఎం, సిబ్బంది నిరంతరం చూపిన శ్రద్ధకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల రూపంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. అవార్డుకు పరిశీలించిన అన్ని అంశాల్లో ఉమ్మడి జిల్లాలో 8
చిన్నారులకు చేతులు శుభ్రం చేసుకునే విధానాన్ని వివరిస్తున్న రావెల ప్రధానోపాధ్యాయిని నాగమణి (పాతచిత్రం)
న్యూస్టుడే, దుగ్గిరాల, తాడికొండ: ఆ ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలించింది. హెచ్ఎం, సిబ్బంది నిరంతరం చూపిన శ్రద్ధకు స్వచ్ఛ విద్యాలయ పురస్కారాల రూపంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. అవార్డుకు పరిశీలించిన అన్ని అంశాల్లో ఉమ్మడి జిల్లాలో 8 స్కూళ్లు మంచి రేటింగ్ (ప్రతిభ) కనబరిచాయి. వాటిలో రేవేంద్రపాడు జడ్పీ ఉన్నత పాఠశాల (దుగ్గిరాల), ఎస్ఎంపీఈఎస్, కొత్తపేట (తెనాలి), జడ్పీహెచ్ఎస్ రావెల (తాడికొండ), ఎంపీయూపీఎస్ వి.బి.పాలెం (పొన్నూరు), నాట్కో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (పొన్నూరు), ఎంపీపీఎస్ పాలపాడు బీహెచ్టెంపుల్ (నర్సరావుపేట), సుమేధ హైస్కూలు ఎన్జీవో కాలనీ మెయిన్ రోడ్ (గుంటూరు) ఎంపీˆ యూపీˆఎస్ గొడవర్రు (చేబ్రోలు) ముందంజలో ఉన్నాయి. మరో 35 స్కూళ్లు ఒకటి, రెండు అంశాలు మినహా మిగిలిన వాటిలో రేటింగ్ పొంది అవార్డును అందుకున్నాయి.
ఎంపిక చేశారిలా..
పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు వినియోగం, పాఠశాల నిర్వహణ, కొవిడ్-19 నిబంధనల అమలు, పాఠశాల స్వచ్ఛతలో బాలల సంఘాల తీరు, టీచర్ల పర్యవేక్షణ తదితర అంశాల్లో వివరాలు ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదు చేశారు. ఒక్కో అంశానికి ప్రశ్నావళి ఉంది. విద్యా సంస్థలో ఉన్న వసతులు ఆధరంగా వాటిని హెచ్ఎంలు నమోదు చేశారు. వాటిని పరిశీలించిన అధికారులు స్టార్ రేటింగ్ ఇచ్చారు. 90 నుంచి 100 శాతం ఫలితాలుంటే 5 స్టార్, 75-89 శాతం ఉంటే 4 స్టార్, 51-74 శాతం ఉంటే 3 స్టార్, 35-50 శాతం ఉంటే 2 స్టార్ చిహ్నాలు కేటాయించారు. అవిభక్త గుంటూరు జిల్లాలో 569 స్కూళ్లకు 5 స్టార్ గుర్తింపు, 2401 పాఠశాలలకు 4 స్టార్ గుర్తింపు, 1690 విద్యా సంస్థలకు 3 స్టార్ గుర్తింపు లభించింది.
క్షేత్రస్థాయిలో పరిశీలన
ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలు వాస్తవంగా ఎలా ఉన్నాయోనని పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో సీఆర్పీలు, ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఒక మండలం వాళ్లు వేరే మండలంలో పరిశీలించి తమకు ఇచ్చిన ఫారంలో వివరాలు ఈ ఏడాది ఏప్రిల్లో ఆన్లైన్లో పొందుపరిచారు.
ఆనందంగా ఉంది: చంద్రశేఖర్, హెచ్ఎం, రేవేంద్రపాడు
అవార్డు రావడం చాలా అనందంగా ఉంది. నాతో పాటు సహచర ఉపాధ్యాయులు కృషి చేయబట్టే ఇది సాధ్యమయ్యింది. దీనికితోడు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, దాతలు ఇలా అందరి ప్రోత్సాహం ఉంది. మా ముందుతరం వారు స్కూలును అందంగా తీర్చిదిద్దారు. దానిని స్ఫూర్తిగా తీసుకుంటాం. మా స్కూల్లో నేషనల్ గ్రీన్కోర్ ఉంది. దీనిలో విద్యార్ధులు ఖాళీ సమయాల్లో స్కూల్లో పర్యావరణం, పచ్చదనం పరిరక్షణకు ఉపాధ్యాయుల సమక్షంలో కష్టపడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!