Andhra news: ‘అమ్మఒడి’లో మరో కుదింపు.. ల్యాప్‌టాప్‌లు ఇచ్చే విధానానికి స్వస్తి!

రాష్ట్రంలో అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో ఏపీ సర్కార్‌ మరో కోత విధించింది. అమ్మ ఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి...

Published : 28 Jun 2022 02:07 IST

అమరావతి: రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘అమ్మఒడి’ పథకంలో ఏపీ సర్కార్‌ మరో కోత విధించింది! అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ ఏడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. బైజూస్‌తో ఒప్పందంలో భాగంగా ట్యాబ్‌లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించిన ఏపీ సర్కార్‌.. సెప్టెంబర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.12వేలు ఖరీదు చేసే ట్యాబ్‌ను ఇవ్వనుంది. తొమ్మిది నుంచి 12వ తరగతి చదివే వారికి గతంలో అమ్మ ఒడికి బదులుగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించడంతో 8,21,655మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ల్యాప్‌టాప్‌ ధర రూ.26వేలు కావడంతో ప్రభుత్వం వాటి కొనుగోలు ఆలోచన విరమించుకున్నట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని