logo

తనఖా పెట్టిన రూ.1.8లక్షల బంగారం మాయం

తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు సొసైటీకి వెళ్లిన రైతుకు చేదు అనుభవం ఎదురైంది. రక్షణగా ఉంటుందని సొసైటీలో తనఖా పెడితే కాపాడాల్సిన వారే కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సొసైటీ

Published : 28 Jun 2022 06:20 IST

పెనుమాక(తాడేపల్లి), న్యూస్‌టుడే: తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు సొసైటీకి వెళ్లిన రైతుకు చేదు అనుభవం ఎదురైంది. రక్షణగా ఉంటుందని సొసైటీలో తనఖా పెడితే కాపాడాల్సిన వారే కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సొసైటీ అధికారులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెనుమాక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 64 గ్రాముల బంగారు నగలను ఎర్రబాలెం గ్రామానికి చెందిన రైతు శివశంకరరావు తనఖా పెట్టి రూ.1.8లక్షలు రుణం తీసుకున్నారు. రెండేళ్లు గడుస్తుండడంతో తనఖాపెట్టిన బంగారాన్ని విడిపించుకుని తీసుకువెళ్లేందుకు పరపతి సంఘానికి వెళ్లారు. నగదు చెల్లించిన తరువాత లాకర్‌ తెరిచి చూడగా అందులో బంగారు నగలు కనిపించకపోవడంతో అక్కడ పనిచేసే సిబ్బందితో పాటు తనఖాపెట్టిన రైతు నిర్ఘాంతపోయారు. లాకర్‌లో పెట్టిన బంగారం ఎలా మాయమైందో సంఘంలోని సిబ్బందికే తెలియాల్సి ఉంది. బంగారం మాయమైన ఘటన సంఘం అధ్యక్షుడు శివారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సిబ్బందిని విచారించారు. గతంలో ఇక్కడ పని చేసిన ఓ ఉద్యోగి చేతివాటం ఫలితంగానే లాకర్‌లో బంగారం కనిపంచకుండా పోయిందని నిర్ధారణకు వచ్చిన ఆయన తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని