logo

‘రైతుగా గుర్తించి న్యాయం చేయరూ’

కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామానికి చెందిన విజయరావు వెంకటసుబ్బారావు అనే రైతు వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చలేక కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని అప్పట్లో అధికారులు ధ్రువీకరించారు.

Published : 28 Jun 2022 06:20 IST

రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

మేదరమెట్ల: కొరిశపాడు మండలం పి.గుడిపాడు గ్రామానికి చెందిన విజయరావు వెంకటసుబ్బారావు అనే రైతు వ్యవసాయం కోసం చేసిన అప్పులను తీర్చలేక కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని అప్పట్లో అధికారులు ధ్రువీకరించారు. కానీ ఇప్పటి వరకూ తమకు ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయం అందలేదని కుటుంబ సభ్యులు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సాయం కోసం తాము ఇచ్చిన అర్జీ ఆర్డీవో కార్యాలయంలో తిరస్కరణకు గురైనట్లు తమకు సమాచారం అందిందని ఆమెకు తెలిపారు. మృతుడు తనకున్న కొద్దిపాటి పొలంతో పాటు 5.6 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. దీనికి తోడు కూరగాయలను గ్రామం నుంచి తీసుకెళ్లేందుకు ఆటో నడిపేవారు. వరుసగా రెండేళ్లు నష్టాలు రావడంతో వ్యవసాయం కోసం చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆటో నడిపేవాడనే కారణంతోనే రైతుగా గుర్తించలేదని అందుకే ప్రభుత్వ సహాయం అందలేదని వారు వాపోయారు. ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని స్పందనలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని