cm jagan: ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌  అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు

Published : 28 Jun 2022 17:51 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌  అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీ, సిబ్బంది నియామకంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీలో పొరపాట్లు, అక్రమాలకు ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. ఈ ఖాతా నుంచే  ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆసుపత్రికి నగదు బదిలీ చేయాలని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 2,436 చికిత్సల సంఖ్య ఇంకా పెంచాలని సూచించారు.  ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో ఖాళీల కొరత ఉండకూడదని, అవసరమైతే సిబ్బంది పదవీ విరమణ వయసు పెంచేందుకు ఆలోచించాలని చెప్పారు. త్వరలో 176 పీహెచ్‌సీలు పూర్తి చేసి 2,072 పోస్టులు భర్తీ చేస్తామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని