logo

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ.44లక్షల దుర్వినియోగం

పెదనందిపాడు బాంకు ఆఫ్‌ బరోడా శాఖలో రూ.44లక్షలు దుర్వినియోగమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇదే బ్యాంకులో పని చేసే సహాయ మేనేజర్‌ సత్యజిత్‌ స్వైన్‌ ఈ దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ మేరకు స్థానిక

Published : 30 Jun 2022 05:17 IST

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడు బాంకు ఆఫ్‌ బరోడా శాఖలో రూ.44లక్షలు దుర్వినియోగమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇదే బ్యాంకులో పని చేసే సహాయ మేనేజర్‌ సత్యజిత్‌ స్వైన్‌ ఈ దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు బ్యాంకు డిప్యూటీ ఆర్‌ఎం విద్యాసాగర్‌ బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. 2019 -21 వరకు పని చేసిన సహాయ మేనేజర్‌ సత్యజిత్‌స్వైన్‌ బోగస్‌ ఖాతాలు సృష్టించి ఆ ఖాతాలలో రూ.44లక్షలు జమ చేశారు. అనంతరం ఆ డబ్బును తన సొంత ఖాతాకు మళ్లించాడు. అనంతరం బ్యాంకు లావాదేవీల ద్వారా ఏటా వచ్చే లాభాల డబ్బు రూ.44లక్షలు బ్యాంకు ఖాతాకు జమ చేశాడు. తాజాగా ఇటీవల ఆడిట్ అధికారులు చేసిన తనిఖీలో నిధులు దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. మార్చిలో జరిగిన ఆడిట్ సందర్భంగా నిధులు దుర్వినియోగం చేసిన సత్యజిత్‌ స్వైన్‌ను సస్పెండ్‌ చేశారు. ఆడిట్ రీవెరిఫికేషన్‌ అనంతరం నిధులు దుర్వినియోగం వాస్తవం అని తేలడంతో డిప్యూటీ ఆర్‌ఎం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఎస్సై అశోక్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని