logo
Published : 30 Jun 2022 05:17 IST

అక్రమంగా నిల్వచేసిన వరి విత్తనాల సీజ్‌

కొల్లిపర, న్యూస్‌టుడే: అనధికారికంగా నిల్వచేసిన విత్తన నిల్వలను సీజ్‌చేసినట్టు మండల వ్యవసాయాధికారి వెంకటరావు తెలిపారు. బుధవారం మండలంలోని వల్లభాపురంలో వరి విత్తనాలను అక్రమంగా నిల్వ ఉంచినట్టు సమాచారం అందడంతో దాడులు చేశామని పేర్కొన్నారు. ఇక్కడ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ‘ఈగల్‌ సీడ్స్‌ బయోటెక్‌ లిమిటెడ్‌’ వారి విత్తనాలు బీపీటీ 5204 రకం 75 క్వింటాళ్లను గుర్తించామని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన వినాయక ట్రేడర్స్‌కు ఇండోర్‌కు చెందిన సంస్థ ఈ విత్తనాలు సరఫరా చేసిందన్నారు. సంబంధిత సంస్థ నిల్వలను డీలరు తీసుకునేందుకు నిరాకరించడంతో కంపెనీ నిర్వాహకుడు గ్రామానికి చెందిన సాయిరామిరెడ్డి గిడ్డంగిలో వాటిని నిల్వ చేసినట్టు తమ విచారణలో తేలిందన్నారు. సరకు విలువ రూ.2.81 లక్షల మేర ఉంటుందని తెలిపారు. సంబంధిత సంస్థ నిర్వాహకుడు భవన్నారాయణపై నిత్యావసరాల చట్టం ‘6ఎ’ కింద కేసు నమోదు చేసి, కలెక్టరుకు సమాచారమందించినట్టు ఏవో చెప్పారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని